హైదరాబాద్, జూలై 10(నమస్తే తెలంగాణ) : ప్రపంచ స్థాయి సెమీకండక్టర్, డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగాలకు హైదరాబాద్ విశ్వసనీయ గమ్యస్థానంగా మారడం వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం దూరదృష్టితో అనుసరించిన విధానాలే కారణమని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు. నగరంలో ఉన్న అపారమైన మానవ వనరులు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, అత్యాధునిక మౌలిక సదుపాయాల వల్లే ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయని తెలిపారు. ప్రముఖ అంతర్జాతీయ సెమీకండక్టర్ సంస్థ కండూ ఏఐ భారతదేశంలో తన తొలి చిప్ డిజైన్ హెడ్‌క్వార్టర్స్‌ను హైదరాబాద్ కొండాపూర్‌లోని క్రిషే ఎమరాల్డ్ భవనంలో నెలకొల్పగా, కేటీఆర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కండూ ఏఐ తన ఇండియా హెడ్‌క్వార్టర్స్‌ను హైదరాబాద్‌లో స్థాపించడం నగర ప్రతిష్ఠను మరింత పెంచిందని పేర్కొన్నారు. ఈ సెంటర్ ద్వారా అత్యాధునిక సాంకేతిక ఆవిషరణలు జరుగడమే కాకుండా, స్థానిక యువతకు ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో సెమీకండక్టర్ పరిశ్రమలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని ధీమాగా చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యానికి, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
కొండాపూర్‌లో ప్రారంభమైన ఈ కేంద్రంలో చిప్ డిజైన్, వెరిఫికేషన్, వ్యాలిడేషన్, ఫర్మ్‌వేర్, సాఫ్ట్వేర్, సిస్టమ్స్ ఇంజినీరింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి అత్యంత కీలకమైన విభాగాలు పనిచేయనున్నాయి. ఈ కేంద్రం ఏర్పాటుతో కండూ ఏఐ గ్లోబల్ ఇంజినీరింగ్ నెట్వర్ మరింత బలోపేతం కావడమే కాకుండా, అంతర్జాతీయ సెమీకండక్టర్ మ్యాప్‌లో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నది.
ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ ఇంజినీరింగ్ ప్రతిభకు హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా నిలిచింది. సంస్థ దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికల్లో భాగంగానే ఈ చిప్ డిజైన్ హెడ్ క్వార్టర్స్‌ను ఇకడ ఏర్పాటుచేశాం. రాబోయే రోజుల్లో స్థానిక ప్రతిభను మరింత ప్రోత్సహిస్తూ, ఇకడి విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా పనిచేస్తాం. ఈ కేంద్రం అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ డిజైన్, హై-స్పీడ్ కనెక్టివిటీ, నెక్ట్స్ జనరేషన్ ఏఐ సిస్టమ్ డెవలప్మెంట్కు కీలక ఇంజినీరింగ్ హబ్‌గా సేవలు అందిస్తున్నది.
హైదరాబాద్, జూలై 10(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా నియమితులైన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు.

పుష్పగుచ్ఛం అందజేసి తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్.. రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్లో పార్టీ తరఫున తెలంగాణవాణిని బలంగా వినిపించాలని ఆకాంక్షించారు.