హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సామాన్యుల హక్కులను హ రిస్తున్న కాంగ్రెస్ పాలనపై సంఘటితంగా పోరాటం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఆదివారం బీడీఎల్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ బీడీఎల్ కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కా ర్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శాసన సభలో కార్మికుల హక్కులు, సమస్యలపై సర్కార్‌ను నిలదీస్తామన్నారు. రాజ్యసభలోనూ కేం ద్రంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. అన్ని కార్మిక సంఘాలు సంఘటితమై ప్ర భుత్వ విధానాలను ఎండగట్టాలని సూ చించారు. సంక్షోభంలో ఉన్న ఆటో కార్మికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చా రు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభు త్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నద ని విమర్శించారు. రైతులు, ఆశ వరర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, లగచర్ల భూ ముల రైతులు తమ హకుల కోసం పోరాడుతుంటే వారిపై అణచివేత చర్యలు చేపట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యహరిస్తే ఎవర్నీ వదలబోమని హెచ్చరించారు. జనవరి మొదటి వారంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో కార్మికుల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలపై చర్చిం చి, ప్రభుత్వంపై పోరాటాలకు కార్యాచరణ రూపొందించి క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు.
పబ్లిక్ సెక్టార్ కంపెనీల పునరుద్ధరణకు కేసీఆర్ కృషి
రాష్ర్టాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించిన పబ్లిక్ సెక్టార్ కంపెనీల పునరుద్ధరణకు కేసీఆర్ విశేష కృషి చేశారని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో మేధావులు, నిపుణులతో కలిసి ప్రతిష్ఠాత్మక ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. సింగరేణి వంటి సంస్థకు ఎన్నడూ లేని స్థాయిలో లాభాలు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పబ్లిక్ సెక్టార్ సంస్థలను అదానీకి రాసిస్తున్నదని మండిపడ్డారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని కోరితే దానికి అవసరమైన ఇనుప గనులను అదానీకి రాసిచ్చారని విమర్శించారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే రైతు బీమా పథకాన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీకి అప్పగించి దాన్ని బలపరిచిన ఘనత కూడా కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, వాణీదేవి, నవీన్ కుమార్‌రెడ్డి, శంభీపూర్ రాజు పాల్గొన్నారు.