హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి వర్క్‌షాపును వచ్చేవారంలో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్‌లో నిర్వహించనున్నారు. ఈ వర్క్‌షాపునకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశ్‌పతి శ్రీనివాస్‌తోపాటు పలువురు బీఆర్ఎస్వీ నాయకులు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే ప్రారంభ సెషన్లో హరీశ్‌రావు, మధ్యాహ్నం సెషన్లో దేశపతి శ్రీనివాస్, జగదీశ్‌రెడ్డి ప్రసంగిస్తారు. సాయంత్రం కేటీఆర్ ప్ర సంగిస్తారని నిర్వాహకులు తెలిపారు.
సగంనెల గడిచినా 2,600మందికి వేతనం రాలె! ; తీవ్ర ఇబ్బందులు పడుతున్న 8జిల్లాల్లోని హోంగార్డులు
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు వేస్తున్నామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈనెల సగం రోజులు గడిచినా ఇంకా 8జిల్లాల్లోని హోంగార్డులకు జీతాలు ఇవ్వలేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై అధికారులను ప్రశ్నిస్తుంటే.. ‘ఆర్థిక లోటు ఉంది.. ఇప్పట్లో ఇవ్వలేరు.. వచ్చేటప్పుడు వస్తాయిలే’ అని సమాధానం చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ షేర్ ఆటోలా వాడుతున్న మంత్రులు.. తమకు వేతనాలు ఇప్పించడంలో ఎందుకు చొరవచూపడం లేదని ప్రశ్నిస్తున్నారు. 8జిల్లాల్లో దాదాపు 2,600 మంది వేతనాల కోసం ఎదురుచూస్తున్నామని వాపోతున్నారు. పోలీసులకు ఒకటో తారీఖున వేతనం అందుతుండగా.. హోంగార్డులపై మాత్రం ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతుందని నిలదీస్తున్నారు. జీతాలు రాకపోవడంతో పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.