హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): మలి దశ ఉద్యమంలో చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ చేసిన పోరాటాన్ని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయన సారథ్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాగర్‌కర్నూల్‌కు చెందిన కొందరు జానపదులు ‘గులాబీల జెండలే రామక్క’ అనే పాట రూపంలోకి తీసుకొచ్చారు. ఈ పాటను శుక్రవారం ప్రగతిభవన్‌లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు విడుదల చేశారు.
తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతిబింబించేలా ఈ పాట ఉన్నదని, పాట పాడిన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తాండ్ర గ్రామానికి చెందిన కొమ్ము లక్ష్మమ్మ, బొల్లె సుశీల, శాంతమ్మ, కళమ్మ, అనసూయలను మంత్రులు అభినందించారు. ఈ పాట ను మంత్రులు విడుదల చేయడం సంతోషంగా ఉన్నదని గాయకులు తెలిపారు. గానంతో ఆకట్టుకున్న కొమ్ము లక్షమ్మ బృందానికి మంత్రి కేటీఆర్ పోచంపల్లి చీరలను బహూకరించి, సతరించారు. పాటకు సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ్ కీస్‌ను మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు. పాట విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.