KTR | సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ రైతుబంధుపై సబ్ కమిటీ వేసింది రైతుబంధు ఎగ్గొట్టేందుకేనని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ ఎన్ని అబద్ధాలు అంటే.. తెలంగాణలోని రైతుల ఆత్మహత్యలపై కూడా ప్రభుత్వం కూడా దిగజారింది. 2014లో అధికారంలో వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు సంవత్సరానికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం.. 1348 రైతు ఆత్మహత్యలు జరిగాయి. 2015లో 1400, 2016లో 645, 2017లో 851, 2018లో 908 రైతు ఆత్మహత్యలు జరిగాయి. 2019లో రైతుబంధు స్టార్ట్ అయ్యాక 2019లో 499, 2020లో 471, 2021లో 359, 2022లో కేవలం 178 రైతు ఆత్మహత్యలు జరిగాయి. ఇది రైతుబంధు, రైతుబీమా ప్రభావం కాదా? పెరిగిన వ్యవసాయ విస్తరణ ఫలితం కాదా? అందుబాటులోకి వచ్చిన చెరువులు, కాళేశ్వరం ప్రాజెక్టులతో స్థిరీకరించబడ్డ సాగు కాదా? వ్యవసాయం కాదా? ఇది ప్రామాణికం కాదా?’ అంటూ నిలదీశారు.
‘రైతు ఆత్మహత్యల్లో భారతదేశంలో తెలంగాణ భాగస్వామ్యం 11శాతం ఉండేది. దాన్ని 1.57శాతానికి తగ్గిస్తే.. దాన్ని కూడా చిన్నగా చేసి.. చూపే చిల్లరప్రయత్నం రేవంత్‌రెడ్డి చేసిండు. ఇంకా నికృష్టపు మాటలు. వీళ్లు మాకు అప్పచెప్పిన నాటే సర్‌ప్లస్‌గా ఇచ్చినం అని చెబుతున్నడు. రేవంత్‌రెడ్డికి చరిత్ర తెలియదు.. వర్తమానం తెల్వదు. లెక్కలు అంతకన్నా తెల్వదు. తెలంగాణ, ఆంధ్రాతో కలిసిన నాడే 1956 సంవత్సరంలో సర్ప్లస్ స్టేట్. 1968లో సర్ప్లస్ స్టేట్ తెలంగాణ మొదటి సారి ప్రారంభమైనప్పుడు. 2001లో రెండోదశ ఉద్యమం ప్రారంభమైనప్పుడు సర్ప్లస్ స్టేట్. 2014లో తెలంగాణ వచ్చినప్పుడు సర్ప్లస్ స్టేట్. కొత్తగా నీ కాంగ్రెస్ పార్టీ పీకింది లేదు. ఇచ్చింది ఏం లేదు. మీ ప్రభుత్వం ఊడబొడిచిందేమీ లేదు. ఇంకా సిగ్గుమాలిన మాట. ఒక సంవత్సరంలో రూ.20వేలకోట్లు రుణమాఫీకి ఇచ్చినం అన్నడు. కేవలం ఇచ్చింది లెక్కగడితే రూ.12వేలకోట్లు దాటదు. కానీ, అదే మా ప్రభుత్వం పదేళ్లలో రూ.28వేలకోట్ల రుణమాఫీ రెండు దఫాల్లో. మరో వైపు రూ.73వేలకోట్ల రైతుబంధు. ఈ రెండు కలిపితే రైతుల ఖాతాల్లో పైసలు లెక్కపెడితే రూ.లక్ష కోట్లు దాటింది’ అని తెలిపారు.
‘ఇవాళ రైతుబంధు భారతదేశానికి ఆదర్శమైంది. పీఎం కిసాన్‌గా పేరు మారింది. కృషిబంధు బెంగాల్లో.. ఇంకా చాలా రాష్ట్రాల్లో పేరు మారింది. ఇవాళ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం. రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సబ్ కమిటీ వేసిందే టైమ్‌పాస్‌కి, రైతుబంధు ఎగ్గొట్టెందుకు, కోత పెట్టేందుకు. ఉద్యోగుస్తులకు నేను ఇయ్యా రైతుబంధు ఇవ్వనని ఎందుకు చెప్పలేదు అని నేను ఇవాళ అడిగినా.. ఉద్యోగస్తుడి తల్లిదండ్రులు వ్యవసాయదారులైతే.. ఆ ఉద్యోగస్తుడు వ్యవసాయ కుటుంబం నుంచే.. సాయంత్రం ఉద్యోగం నుంచి వస్తే పోయి వ్యవసాయం చేయడా? ఆయనకు భూమితో ఉన్న కనెక్షన్ ఎందుకు కట్ చేస్తున్నవ్. ఆయనను ఎందుకు రైతుగా గుర్తిస్తలేవు అని అడిగినాను. తెలంగాణలో 1.30కోట్ల పాన్ కార్డులు ఉన్నయ్. పాన్ కార్డ్ నిబంధన పెడితే మిగేలదీ ఎవరు? ఆలోచించాలని కోరిన. ఐటీ అంటున్నవ్.. ఆదాపు కట్టె వారిలో రైతుబిడ్డలు అయిన ఉద్యోగులు ఉన్నరు. జర్నలిస్ట్‌లు ఉన్నరు. ఐటీ కట్టేవారందరికీ రైతుబంధు తీసేస్తానంటే.. ఎవడు మిగులుతడు ? అందుకే నేను అడిగినా సమాధానం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.