Rajinikanth | టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ వెల్లలచెరువు రజినీకాంత్ తండ్రి వెల్లలచెరువు సాంబశివరావు మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సాంబశివరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తండ్రిని కోల్పోయి తీరని దుఃఖంలో ఉన్న రజినీకాంత్కు, వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.