KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : ‘ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్లు కూలగొట్టుమని ఇందిరమ్మ చెప్పిందా? సోనియమ్మ చెప్పిందా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇండ్లు కూల్చి రిసార్టులు కడితే ఒరిగేదేమిటి రేవంత్? అంటూ నిలదీశారు. అంబర్పేట్ ని యోజకవర్గంలోని మూసీ పరీవాహక ప్రాంతాలైన న్యూ అంబేద్కర్ నగర్, న్యూ తులసీరాంనగర్ ప్రాంతాల్లో కేటీఆర్ మంగళవారం పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. పేదల ఇండ్లను కూల్చాలనుకుంటున్న రేవంత్ ముం దుగా ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
‘ఇందిరమ్మ రాజ్యం పేరిట అందరికీ ఇండ్లు కట్టించాల్సింది పోయి.. పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేందుకు వస్తున్నరు.. రాష్ట్ర బడ్జెట్లో సగం డబ్బును మూసీ పేరిట ఖర్చు చేసేలా రేవంత్ ప్లాన్ చేసిండు.. మల్లయ్య లాంటి పేదల ఇంటిని కూల్చి, రిసార్టులు, రిక్రియేషన్ జోన్లు నిర్మిస్తే ఒరిగేదేమిటి?’ అని ప్రశ్నించారు. ‘మీరు గెలిపించిన కిషన్‌రెడ్డి పదవులు పొంది.. మీ కష్టాల్లో తోడు లేకుండా పారిపోయారు.. తప్పించుకు తిరిగేటోడు నాయకుడెట్లయితడు?’ అని కిషన్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
గరీబోళ్ల కోసం పనిచేస్తానని గద్దెనెక్కిన రేవంత్.. గద్ద లెక్క వచ్చి పేదల ఇండ్లు కూలగొడుతున్నాడని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ.16 వేల కోట్లతో మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందిస్తే కాంగ్రెస్ పది రెట్లు పెంచిందని, ఒకేసారి లక్షన్నర కోట్ల కు ఎలా పెరిగిందని అడిగితే సమాధానం చెప్పేటోడు లేడని మండిపడ్డారు. కూల్చివేతల విషయంలో హైకోర్టు నిన్ననే చె ప్పిందని, ఇండ్లు కూలగొడతామంటే తా ము ఊరుకునేది లేదని స్పష్టం చేసిందని, అయినా సిగ్గులేకుండా శంకర్‌నగర్‌లో ఇండ్లు కూలగొడుతున్నారని ఆగ్రహం వ్య క్తంచేశారు. ‘గరీబోళ్ల ఇండ్లను కూల్చుడు కాదు.. ఆరు గ్యారెంటీలు అమలు చేయా లి.. ఆడపిల్లలకు ఇస్తానన్న రూ.2500 ఇవాలి. ముసలోళ్లకు రూ.4 వేలు, రైతులకు రుణమాఫీ, రైతుబంధు కింద రూ.15వేలు ఇవ్వాలి. ఆటో డ్రైవర్ల బోర్డు పెట్టాలి.. దమ్ముంటే గరీబోళ్లకు 2 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టాలి’ అని డి మాండ్ చేశారు. బుల్డోజర్లను సంఘటితంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఒక్క కాల్ కొడితే తామంతా వస్తామని చెప్పారు. ఆర్బీ-ఎక్స్ పేరిట ఇంటిపై వేసే మార్కింగ్‌ను తుడిచేసి కేసీఆర్ అని రాసుకోవాలని చెప్పారు. ‘కేసులకు భయపడొ ద్దు.. మీపై పెట్టే కేసులకు మేము నిలబడి కొట్లాడుతం’ అని హామీ ఇచ్చారు.