హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎన్నారై విభాగం కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా మహేశ్ బిగాలకు కేటీఆర్, హరీశ్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. భవిష్యత్తులో ఆయన మరింత ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం వారికి మహేశ్ బిగాల కృతజ్ఞతలు తెలిపారు.