హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజల ధర్నాలతో తెలంగాణ దద్దరిల్లుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘దికుమాలిన పాలనలో దికూమొకులేని జీవితం గడుపుతున్నారు.
అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, రైతు నుంచి రైస్ మిల్లర్ల వరకు, కార్మికుల నుంచి కాంట్రాక్టర్ల వరకు, టీచర్ల నుంచి పోలీస్ కుటుంబాల వరకు అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు’ అని ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తం గా అన్ని వర్గాల్లో ‘వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. ముందు దగా-వెనక దగా.. కుడి ఎడమల దగా దగా, కాంగ్రెస్ వచ్చింది-కష్టాలు తెచ్చింది’ అని ఆయన విమర్శించారు.