గణపురం, నవంబర్ 15: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్తు కేంద్రం (కేటీపీపీ) రెండోదశ 600 మెగావాట్ల ప్లాంట్లో 60 రోజులపాటు కరెంట్ ఉత్పత్తి నిలిపివేయనున్నారు. వార్షిక మరమ్మతులో భాగంగా రెండో దశ ప్లాంటును ఓవరాలింగ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
శుక్రవారం రాత్రి నుంచి విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. గతంలో 2021 నవంబర్లో ప్లాంటుకు ఓవరాలింగ్ చేశారు. తాజాగా ఈ నెలలో మరమ్మతులు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.