హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగా ణ): రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణాశాఖ ము ఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాస్‌రాజు గురువారం విధులనుంచి రిలీవ్ అయ్యారు. శ్రీనివాస్‌రాజు మే 2020 నుంచి డిప్యూటేషన్ పై తెలంగాణలో కొనసాగుతున్నారు.
మూడేళ్ల డిప్యూటేషన్ గడువు నిరుడు మేలో పూర్తవడంతో మరో రెండేళ్లు పొడిగించాలని ఆయన కోరారు. దీనికి ఇరు రాష్ర్టాలు అంగీకరించినప్పటికీ కేంద్రం అభ్యంతరం తెలిపింది. దీంతో ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా ఈ ఏడాది మార్చి 31వరకు కొనసాగేందుకు అవకాశం లభించింది. గురువారం ఆయన రిలీవ్ అయ్యారు. ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయేంద్ర బోయికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.