
హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): కృష్ణానది యాజమాన్య మండలి (కేఆర్ఎంబీ) సబ్‌కమిటీ 15, 16వ తేదీల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించనున్నది. అక్కడే 5వ సబ్‌కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు, సబ్‌కమిటీ సభ్యులకు కేఆర్ఎంబీ లేఖను రాసింది. రివర్ బోర్డుల గెజిట్‌ను అమలు చేయడంలో భాగంగా జ్యూరిస్‌డిక్షన్‌లోని సాగునీటి ప్రాజెక్టులను కిందిస్థాయిలో కేఆర్ఎంబీ ముందస్తుగా పరిశీలిస్తూ వివరాలను సేకరిస్తున్నది. అందులో భాగంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో పాటు, దాని పరిధిలోని కాలువలను పరిశీలించాలని నిర్ణయించింది. 15న ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ప్రధాన పవర్‌హౌస్‌లు, కుడి ప్రధాన కాలువ హెడ్‌రెగ్యులేటర్‌ను పరిశీలించనున్నది. 16న నాగార్జున ఎడమగట్టు పవర్‌హౌస్, ఎడమ కాలువ ప్రధాన హెడ్‌రెగ్యులేటర్, వరదకాలువను సబ్‌కమిటీ బృందం సందర్శిస్తుంది. అనంతరం మధ్యాహ్నం అక్కడే 5వ సబ్‌కమిటీ సమావేశం జరుగుతుంది