హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కూకట్‌పల్లిలో అత్యాధునిక వసతులతో అతిపెద్ద ప్రాంగణంలో ఏర్పాటైన జేసీ బ్రదర్స్ వస్త్ర షోరూంను సినీ నటి కృతిశెట్టి ప్రారంభించారు. షోరూంను అద్భుతంగా తీర్చిదిద్దారని, రాబోయే పండుగల సీజన్‌కు ఇది ట్రెండీ షాపింగ్ కేంద్రం అవుతుందని ఆమె తెలిపారు. రెండు దశాబ్దాలుగా జంటనగర ప్రజలకు అతి తక్కువ ధరలకు నాణ్యమైన వస్ర్తాలను అందిస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మర్రి జనార్దన్‌రెడ్డి, మర్రి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.