నల్లగొండ : జిల్లాలోని ఏఎమ్మార్పీ ప్రాజెక్టును కృష్ణా రివర్ బోర్డు సభ్యులు సీఈ శివరాజన్, ప్రసాద్ గురువారం సందర్శించారు. పంపుహౌజ్ పనితీరు, మోటర్ల నుంచి నీటి విడుదలను జెన్కో డీఈ రాములు వారికి వివరించారు.
అనంతరం రంగారెడ్డిగూడెం స్టేజీ వద్ద హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డును పరిశీలించారు. ప్రాజెక్టు ద్వారా విడుదలవుతున్న నీటిని జంటనగరాలకు తరలింపు, ఆయకట్టుపై ఆరా తీశారు. ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించనున్నట్లు వారు తెలిపారు.