హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): పదోతరగతి పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోలను విడుదల చేసినట్టు గురువారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
మెమోలను స్కూల్ వారీగా అప్లోడ్ చేశామని, డౌన్లోడ్ చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మెమోలను ప్రింట్ తీసుకోవాలని పేర్కొన్నారు.