డైట్ అనేది శారీరక ఆరోగ్యానికి మాత్రమే పరిమితమైంది కాదు. మానసిక ఆరోగ్యానికి కూడా పోషకాహారం, జీవనశైలి మార్పులు తప్పనిసరి అని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘మానసిక ఆరోగ్యానికి మంచి డైట్ చాలా అవసరమని వివిధ పరిశోధనల్లో తేలింది. వాస్తవానికి డైట్ అనేది వయసు, లింగం, జీవనశైలిని బట్టి మారుతుందని తేల్చారు అమెరికన్ పరిశోధకురాలు బెగ్డేచ్. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మహిళలు రోజూ కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలనీ, ఓ మోస్తరు వ్యాయామం చేయాలని సలహా ఇస్తారు. తక్కువ కెఫిన్ తీసుకోవడం, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం అవసరం. అలాగే, వృద్ధాప్యంలోని మహిళలు పైన చెప్పినవాటితో పాటు పండ్లు ఎక్కువగా తినాలి. పురుషుల్లో నలభై లోపు వాళ్లు నిత్య వ్యాయామంతో పాటు పాల ఉత్పత్తులు, మాంసాహారం, కెఫిన్ వాడకాన్ని తగ్గించాలి. వృద్ధాప్యంలోని పురుషులు అదనంగా పల్లీలు, బాదం, వాల్నట్ ఎక్కువగా తినాలి.