హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య అందుకున్నారు. ఈ మేరకు నారపల్లిలోని స్వాధ్యాయ సంస్థ కార్యాలయంలో గుంటూరు సంస్కృతి సంస్థ ప్రతినిధులు పురస్కారాన్ని అందజేశారు. ఈ నెల 7న గుంటూరులో పురస్కార ప్రదానం జరగాల్సి ఉండగా, కొన్ని కారణాలతో ఆ కార్యక్రమం వాయిదా పడిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
శరన్నవరాత్రి రోజుల్లో అవార్డు అందజేయడం ఆనందంగా ఉన్నదని వారు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మోదుగుల రవికృష్ణ, ఏల్పూరి మురళీధర్‌రావు, లక్ష్మణ చక్రవర్తి, కస్తూరి మురళీకృష్ణ, ఆచార్య యాదగిరి, ప్రజ్ఞాభారతి అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి బీఎస్ శర్మ, ఆంధ్రభారతి నిర్వాహకులు వాడపల్లి శేషతల్పశాయి, వీరభద్రుడు, అరుణ్ మద్ది తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తేతెలంగాణ):ఆర్మూర్ పసుపు భౌగోళిక గుర్తింపునకు సాంకేతికంగా జీఐ రిజిస్ట్రీ ఆమోదించింది. ఆర్మూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, మంథని, ప్రైమరీ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, ఆర్మూరు పేరిట గుర్తింపు కోసం దాఖలు చేశారు. తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పిడిగం సైదయ్య నాబార్డ్ మద్దతుతో ఈ భౌగోళిక గుర్తింపు ప్రాజెక్టుకు ప్రధాన పరిశోధకుడిగా ఉన్నారు. హార్టికల్చరల్ వర్సిటీ వీసీ రాజిరెడ్డి మాట్లాడుతూ..’భౌగోళిక సూచిక(జీఐ) రిజిస్ట్రేషన్ పసుపు రైతులకు గేమ్-ఛేంజర్ కానుంది. ప్రీమియం ధర, మారెట్ , ఎగుమతి సామర్థ్యం వంటి ఆర్థిక-మారెట్ ప్రయోజనాలు జీఐ ట్యాగ్‌తో ముడిపడి ఉన్నట్టు తెలిపారు.