గోదావరిఖని, ఫిబ్రవరి 27: పెద్దప ల్లి జిల్లా రామగుం డం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తండ్రి మల్లయ్య (82) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. గోదావరిఖనిలో నివా సముంటున్న ఆయన గతంలో సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యారు. పుట్టెడు దు:ఖంలోనూ మాజీ ఎమ్మెల్యే చందర్ మరో ఇద్దరికి వెలుగులు ప్రసాదించడానికి తన తండ్రి నేత్రాలు దానం చేయడానికి ముందుకొచ్చారు. లయన్స్‌క్లబ్, స దాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ రాజేంద్రప్రసాద్.. మల్లయ్య నేత్రాలను సేకరించి హైదరాబాద్ ఐ బ్యాంక్‌కు తరలించారు. ఈ సందర్భంగా చందర్‌ను పలువురు అభినందించారు.