జగిత్యాల, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల అనర్హతపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శాసనసభ స్పీకర్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎన్నికైనప్పటికీ సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని తిరిగి పార్లమెంటుకు పోటీ చేయడం ఇంతకంటే నీచమైన విషయం ఇంకేమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. కనీసం రానున్న కాలంలోనైనా రాజకీయ విలువలు కాపాడాలని, లేకుంటే ప్రజాప్రతినిధులపై ప్రజలకు కనీసం గౌరవం కూడా ఉండదని చెప్పారు. ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా సమాజానికి మంచిది కాదని హితవుపలికారు.