తలాపున గోదావరి ఉన్నా కన్నీళ్లేనా?
‘తలాపున గోదావరి పారుతున్నా.. రైతుల కండ్లలో కన్నీళ్లా? ప్రభుత్వానిది మరీ ఇంత చేతగాని తనమా? ఇచ్చిన హామీల అమలు లో విఫలమై, వ్యవసాయం రంగాన్ని పూర్తి సంక్షోభంలోకి నెట్టివేసింది.
- పాలన చేతగాక ఎల్ నినోపై నెపమా? సర్కార్‌పై కొప్పుల ఫైర్
- దొంతాపూర్‌లో ఎండిన పంట పొలాల పరిశీలన
ధర్మపురి, నవంబర్ 7: ‘తలాపున గోదావరి పారుతున్నా.. రైతుల కండ్లలో కన్నీళ్లా? ప్రభుత్వానిది మరీ ఇంత చేతగాని తనమా? ఇచ్చిన హామీల అమలు లో విఫలమై, వ్యవసాయం రంగాన్ని పూర్తి సంక్షోభంలోకి నెట్టివేసింది. పాలనలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎల్ నినోను సాకుగా చూపుతున్నది’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొం తాపూర్లో ఎండిన వరి, పత్తి పంటలను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు.
పంట నష్టపోయిన రైతులను పరామర్శిం చి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సహకారంతో రూ. 400 కోట్లతో గోదావరి ఆధారంగా ధర్మపురి మండలం ఆరెపల్లి నుంచి వెల్గటూర్ మండలం ముత్తునూర్ వరకు 14 లిఫ్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. అందులో దొంతాపూర్ ఎత్తిపోతల ఒకటని పేర్కొన్నారు. ఆరునెలలుగా ఈ లిఫ్టుకు సంబంధించి రెండు, మూడు మోటర్లు పనిచేయడం లేదని, రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

