బాలరాజుకు బెయిల్ మంజూరు
: బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ రిమాండ్‌ను న్యాయస్థానం నిరాకరించింది. ఆయనకు బెయిల్ మంజూరుచేసింది. శుక్రవారం అర్ధరాత్రి సిట్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.
-
రిమాండ్‌ను నిరాకరించిన కోర్టు
-
విడుదల చేయాలని జడ్జి ఆదేశం
-
న్యాయం గెలిచిందన్న దూదిమెట్ల
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ రిమాండ్‌ను న్యాయస్థానం నిరాకరించింది. ఆయనకు బెయిల్ మంజూరుచేసింది. శుక్రవారం అర్ధరాత్రి సిట్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇటీవల మీడియా సమావేశంలో బాలరాజు యాదవ్ మాట్లాడారు. ఈ క్రమంలో బల్మూరి వెంకట్ భార్య ఇందుజారెడ్డి తన భర్తపై ఎవరో అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో బాలరాజు యాదవ్ పేరు లేకున్నా అదర్స్ పేరుతో ఉన్న దానిలో భాగంగా బాలరాజు యాదవ్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్ సిటీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి, రాత్రి న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చారు. ఆయనను రిమాండ్‌కు తరలించాలన్న పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. బాలరాజును విడుదల చేయాలని ఆదేశించారు. రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలని స్పష్టంచేశారు. బాలరాజుపై నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేండ్లలోపు శిక్ష పడేవేనని న్యాయవాది లక్ష్మణ్ తెలిపారు.
న్యాయం గెలిచింది: బాలరాజు యాదవ్
రాష్ట్ర చరిత్రలోనే ఎవరిపైనా లేనటువంటి కేసు తన మీద పెట్టారని, చివరికి న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్ నేత బాలరాజు యాదవ్ తెలిపారు. బెయిల్‌పై బయటకొచ్చిన అనంతరం ఆయన మాట్లాడారు. తాను కేసు గురించి ఏం మాట్లాడదల్చుకోలేదని, చట్టం బతికున్నదనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కావాలనే బీఆర్ఎస్ నాయకత్వాన్ని బలహీనపర్చాలని చూస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెడుతున్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

