ఈడీ ‘సూపర్ కాప్’ కాదు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాలకు స్పష్టమైన పరిధులను కర్ణాటక హైకోర్టు నిర్దేశించింది. ఈడీ కేవలం పీఎంఎల్ఏ కింద తనకు స్పష్టంగా కల్పించిన అధికారాలను మాత్రమే వినియోగించాలని పేర్కొంది.
- నిర్దేశించిన అధికారాలను మాత్రమే అది వినియోగించాలి: కర్ణాటక హైకోర్టు
బెంగళూరు, నవంబర్ 7: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాలకు స్పష్టమైన పరిధులను కర్ణాటక హైకోర్టు నిర్దేశించింది. ఈడీ కేవలం పీఎంఎల్ఏ కింద తనకు స్పష్టంగా కల్పించిన అధికారాలను మాత్రమే వినియోగించాలని పేర్కొంది. అలవిమాలిన అధికారాలను ఆపాదించుకుంటూ దాని దృష్టికి వచ్చే ప్రతి విషయంపై దర్యాప్తు చేయడానికి అదేమీ ‘సూపర్ కాప్’ కాదని పేర్కొంది. చట్టబద్ధంగా నిర్ణయించిన పనిని కాదంటూ స్వతంత్రంగా మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేయలేదంటూ వ్యాఖ్యానించింది.
‘మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీకి ఉన్న అధికారాలు ఉన్నతమైనవే కానీ, మౌలికమైవని కావు అని, వాటికి పునాదిగా ఉన్న ప్రాథమిక లేదా షెడ్యూల్డ్ నేరం ఇకపై కొనసాగనప్పుడు ఆచట్టం కింద విచారణలు కొనసాగలేవని’ కోర్టు పేర్కొంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై సంజేగౌడ, అతనితో సంబంధం ఉన్న ఇతరులతో సహా అనేకమంది పిటిషనర్లపై ఈడీ ప్రారంభించిన ఈసీఐఆర్, ఇతర చర్యలను జస్టిస్ ఎంఐ అరుణ్ రద్దు చేశారు. ఏజెన్సీ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు నుంచి ఉత్పన్నమయ్యే చర్యలను కూడా కోర్టు పక్కన పెట్టింది. ఆస్తులను జప్తు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. పిటిషనర్లలో ఒకరి దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను తిరిగి ఇవ్వమని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

