హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోరా ట యోధురాలు చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపురూప గౌరవాన్ని ఇచ్చారని రాష్ట్ర రజక సం ఘాల సమితి ముఖ్య సలహాదారు కొండూరి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. రజకులంతా ఎల్లప్పుడూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. తెలంగాణ కల సాకారమైన కొద్దిరోజులకే ఐలమ్మ స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు ఆమె పేరు పెట్టారని చెప్పారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.