సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కొండపాక(Kondapaka) మండల కేంద్రంలో బురదమయంగా మారిన రోడ్డుపై గ్రామస్తులు నాటు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండపాక అభివృద్ధిలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఇండ్లను కూల్చి చేపట్టిన రోడ్డు పనులు(Repair Roads) ఎక్కడిక్కడే ఉన్నాయని ఆరోపించారు. ఇటివల గ్రామానికి వచ్చిన కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లినప్పటికి రోడ్డు పనులు ముందుకు కదలేదన్నారు. దీంతో చిన్న పాటి చినుకులు వచ్చిన రోడ్డు గుంతలతో బురదమయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో రోడ్డు వెంబటి వెళ్లే విద్యార్థులకు, రైతులకు, గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నందునే నిరసన చేపట్టామన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం అధికారులతో పనులు పూర్తి చేయాలని లేని పక్షంలో పార్టీలకు అతీతంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంబటి బాలచందర్గౌడ్, తుప్పుడు స్వామి, బైరోజు నర్సింహ్మచారి, మంతెన నాగార్జున, మంచాల యాదగిరి, చెన్న రమేశ్, తిప్పారం హరీశ్గౌడ్, తుపాకుల శేఖర్, మంచాల బాలకిషన్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.