హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సినీ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అక్కినేని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయాల్లో రాణించడానికి ఇంత దిగజారుతావా? నువ్వేం దేవదాయశాఖ మంత్రివి? అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు దేవాదాయశాఖ మంత్రిగా ఉండటం మా దురదృష్టం’ అంటూ ధ్వజమెత్తారు. ‘అక్కా నీ మానసిక పరిస్థితి బాగాలేదు. వెంటనే మీరు మెంటల్ హాస్పిటల్లో చేరండి’ అంటూ దాడికుమార్ అనే నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి వెంటనే తొలిగించాలని భగవంత్ రావు అనే నెటిజన్ డిమాండ్ చేశారు. ‘చీ నువ్వు మినిస్టర్ ఎట్ల అయినవ్’ అంటూ అనిల్ కుమార్ విమర్శించారు. ‘పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాక చల్లారలేదు అంట. విలువల గురించి కొండా సురేఖ మట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఆమె భర్త మహిళా కార్పొరేటర్లను గెస్ట్‌హౌస్‌లకు తీసుకునిపోయేవారు. ఈ ఘనకార్యాలన్నీ న్యూస్పేపర్లో వచ్చినవే’ అని వరుణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నెటిజన్ వాట్ ఆర్ ద ఆడ్స్ అకౌంట్‌తో ‘కొండా ఈజ్ ద బిగ్గెస్ట్ పొలిటికల్ క్రిమినల్ ఆఫ్ తెలంగాణ. షేమ్ ఆన్ హర్’ అంటూ తీవ్రంగా స్పందించారు.
‘చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలిసి సినిమావాళ్లను ఏపీకి తరలించడానికి చేస్తున్న పెద్ద కుట్ర’ అని నెటిజన్ ఆకుల సాయి తేజ తన పోస్టులో రాసుకొచ్చా రు. మరో నెటిజన్ ఎస్ఎస్ పోస్ట్‌లో కొండా గారు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబిత అనే నెటిజన్ స్పం ది స్తూ..‘ఒక ఆడదానివై ఉండి మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు ఎలా చేయాలనిపించింది? మీరు కూడా అవే పనులు చేశారా?’ అని మండిపడ్డారు.