నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు సమంజసమేనని, ప్రజాప్రతినిధుల కోర్టుకు ఆ కేసును విచారించే అర్హత ఉన్నదని న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. కొండా సురేఖపై కేసు నమోదుకు ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ ఆమె తరఫు న్యాయవాది గుర్మీత్‌సింగ్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న జిల్లా కోర్టు జడ్జి రమాకాంత్ తీర్పును రిజర్వు చేస్తూ కేసును ఏప్రిల్ 8కి వాయిదా వేశారు.