హైదరాబాద్, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ): తన కూతురు చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణలు కోరుతున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇటీవల జరిగిన తన శాఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం, తన కూతురు చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. గురువారం క్యాబినెట్ భేటీ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఒక కుటుంబమని, టీ కప్పులో తుఫాను మాదిరిగా గొడవలు వస్తాయని చెప్పారు. అపార్థం వల్ల కొన్ని గొడవలు వచ్చాయని తెలిపారు.
ఆ రోజు తమ ఇంటికి పోలీసులు రావడంతో తన కూతురు సీఎంపై ఆరోపణలు చేసిందని, ఈ విషయంలో తాను క్షమాపణలు చెప్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినట్టు ఇప్పటికే ‘నమస్తే తెలంగాణ’ వెల్లడించింది. వాటాల్లో లెక్కలు తేలడంతో రాజీ కుదిరిందని, అప్పుడే క్షమాపణ చెప్పిన విషయాన్ని ప్రత్యేక కథనంలో తేల్చిచెప్పింది.