Komatireddy Raj Gopal Reddy | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తాను అన్నదమ్ములం అయినప్పటికీ ఒకే కుటుంబం కాదని, ఇద్దరివి వేర్వేరు కుటుంబాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వడానికి, వెంకట్రెడ్డి తనకు సోదరుడు అవ్వడానికి ఏం సంబం ధం? అని ప్రశ్నించారు.
గాంధీభవన్లో శనివారం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… హుజూర్నగర్ ఎమ్మె ల్యే, కోదాడ ఎమ్మెల్యే ఒకే కుటుంబం అవుతారని మంత్రి ఉత్తమ్, ఆయన సతీమణిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.