హైదరాబాద్, డిసెంబర్3 (నమస్తే తెలంగాణ): అఖిల భారత వికలాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావుకు బెస్ట్ రోల్ మాడల్ అవార్డును గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అందజేశారు. రాజ్‌భవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా నాగేశ్వరరావును గవర్నర్ సత్కరించారు. రైల్వే బోర్డు మెంబరుగా, దివ్యాంగుల హక్కుల కోసం 25 ఏండ్లుగా ఆయన చేస్తున్న సేవలను అభినందించారు.