Kollapur | కొల్లాపూర్ పీజీ కాలేజీ విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. ప్రైవేట్ పార్ట్ కొరకడంతో నగ్నంగానే పరార్!
Kollapur | నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Kollapur | నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. టీసీ కోసం వచ్చిన ఓ విద్యార్థితో ప్రిన్సిపాల్ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి తన రూమ్‌కు పిలిపించుకుని లైంగిక దాడికి యత్నించడంతో ప్రైవేట్ పార్ట్ కొరికేశాడు. దీంతో ప్రిన్సిపాల్ నగ్నంగానే పారిపోవడంతో, సదరు విద్యార్థి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు.
బాధిత విద్యార్థి ఫిర్యాదు ప్రకారం.. పాలమూరు వర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు. టీసీ కోసం వచ్చిన అతనిపై ప్రిన్సిపాల్ కొంతకాలంగా అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్ తన గదిలోకి పిలిపించుకున్నాడు. అనంతరం విద్యార్థిపై లైంగిక దాడికి యత్నించాడు. ప్రిన్సిపాల్ తనపై చేస్తున్న చిత్రహింసలను భరించలేని విద్యార్థి కోపంతో ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసి, అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అనంతరం సదరు విద్యార్థి ఇతర విద్యార్థులకు జరిగిన విషయం చెప్పాడు.
విషయం తెలియగానే ఇతర విద్యార్థులు ప్రిన్సిపాల్ నివాసానికి చేరుకున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున విద్యార్థులు రావడంతో భయపడిపోయిన ప్రిన్సిపాల్ నగ్నంగానే అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఇతర విద్యార్థుల సాయంతో బాధిత విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. తనపై ప్రిన్సిపాల్ కొద్దిరోజులుగా చేస్తున్న శారీరక, మానసిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ప్రిన్సిపాల్ రాక కోసం పీజీ విద్యార్థులు రాత్రంతా పడిగాపులు కాశారు. ప్రిన్సిపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేసి, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

