CWC | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల నీటిపారుదల సామర్థ్యంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని నమోదుచేసింది. నీటిపారుదల సామర్థ్యంలో రాష్ర్టానికి చెందిన పలు ప్రాజెక్టులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (వాలంతరి), వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ (వాల్మీ), సెంటర్‌ఫర్ వాటర్ రిసోర్సెస్డెవలప్మెంట్ (సీడబ్ల్యూఆర్డీ) అనే మూడు ప్రధాన సంస్థలు దేశవ్యాప్తంగా 17 మేజర్, మధ్యతరహా ప్రాజెక్టుల నీటిపారుదల సామర్థ్యంపై బేస్‌లైన్ అధ్యయనం నిర్వహించాయి. వీటితోపాటు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సైతం 35 నీటిపారుదల ప్రాజెక్టుల నీటి వినియోగ సామర్థ్యాన్ని అధ్యయనం చేసింది.
ఆ నివేదికను ‘సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం’ పేరిట ఇటీవలనే కేంద్ర జల్‌శక్తిశాఖ పార్లమెంటు వేదికగా వెల్లడించింది. అందులో తెలంగాణకు సంబంధించిన సాత్నాల, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. కాలువల ఆధునికీకరణ, నీటియాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా నీటి వృథాను అరికట్టి డెవలప్మెంట్ (సీడబ్ల్యూఆర్డీ) అనే మూడు ప్రధాన సంస్థలు దేశవ్యాప్తంగా 17 మేజర్, మధ్యతరహా ప్రాజెక్టుల నీటిపారుదల సామర్థ్యంపై బేస్‌లైన్ అధ్యయనం నిర్వహించాయి. వీటితోపాటు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సైతం 35 నీటిపారుదల ప్రాజెక్టుల నీటి వినియోగ సామర్థ్యాన్ని అధ్యయనం చేసింది.
ఆ నివేదికను ‘సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం’ పేరిట ఇటీవలనే కేంద్ర జల్‌శక్తిశాఖ పార్లమెంటు వేదికగా వెల్లడించింది. అందులో తెలంగాణకు సంబంధించిన సాత్నాల, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. కాలువల ఆధునికీకరణ, నీటియాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా నీటి వృథాను అరికట్టి తద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతున్నది.
అన్ని రాష్ర్టాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. క్షేత్రస్థాయిలో నీటి వినియోగంలోని అన్ని రంగాల్లో నీటి పొదుపు చర్యలను చేపట్టేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. నీటి వినియోగ సామర్థ్యాన్ని 20% మేరకు మెరుగుపరచాలనే లక్ష్యంతో నిరుడు కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేకంగా బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ (బీడబ్ల్యూయూఈ) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఇది నీటి వినియోగ సామర్థ్యం పెంపు, నిర్వహణ తదితర అంశాలను పర్యవేక్షిస్తున్నది.
Koill Sagar
సాగునీటి నిర్వహణలో భేష్
ప్రాజెక్టులను నిర్మించడమే కాకుండా వాటిని సమర్థంగా, పకడ్బందీగా వినియోగించుకునే అంశాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. నీటి వినియోగంలో వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ఆయకట్టుకు సాగునీరందడం ఒక కలగా ఉండేది. ప్రాజెక్టు సమీపంలోని ఆయకట్టుకు మాత్రమే నీరందేది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. టెయిల్ టు హెడ్ (చివరి నుంచి మొదటికి) పద్ధతికి శ్రీకారం చుట్టింది. మొదట చివరి ఆయకట్టుకు సాగునీరందిస్తూ క్రమంగా ప్రాజెక్టు సమీపంలోని ఆయకట్టుకు నీరందించే విధానం అవలంభించింది.
ఫలితంగా చివరి ఆయకట్టుకు కూడా సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. సమృద్ధిగా నీరు అందుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరాంసాగర్ మొదటి దశ ఆయకట్టుకే పూర్తిగా నీరందని దుస్థితి నుంచి నేడు ఎస్సారెస్పీ రెండో దశలోని చివరి ఆయకట్టుకు సైతం నీరందడం విశేషం. కాలువల్లో నిరంతరం సాగునీటిని విడుదల చేయకుండా ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నది. వారం విడిచి వారం తడిని అందిస్తున్నది. ఈ విధానం వల్ల నీటి వృథాను అరికట్టడమే కాకుండా, పంటల దిగుబడి కూడా గణనీయంగా పెరగింది. తాజాగా కేంద్రం విడుదల చేసిన గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడించాయి.