కోదాడ, ఆగస్టు 20: కలప వ్యాపారానికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా కోదాడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కోదాడ బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న ఓ వ్యక్తిని రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు.
బుధవారం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో సదరు వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న వెంకన్నను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం బీట్ ఆఫీసర్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని నల్లగొండ ఏసీబీ అధికారులు తెలిపారు.