యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో (Yadadri bhuvanagiri Collectorate) ఉద్యోగి మరో ఉద్యోగిపై కత్తితో దాడి(Knife attack) చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మధ్య ఘర్షణ. చోటు చేసుకుంది. మనోజ్ అనే ఉద్యోగిపై మరో మహిళా ఉద్యోగి కత్తితో దాడి చేసింది. ఈ ఘర్షణలో గాయపడిన మనోజ్‌ను తోటి ఉద్యోగులు జిల్లా దవాఖానకు తరలించారు. ఆత్మ రక్షణ కోసమే దాడి చేయాల్సి వచ్చిందని సదరు మహిళా ఉద్యోగి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న నిందితురాలు మనోజ్‌తో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.