Jagadish Reddy | నల్గొండ జిల్లా కిష్టరాయనపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురైన భూ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించి అండగా ఉంటామని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
కిష్టరాయనపల్లి ప్రాజెక్టు క్రింద భూములు కోల్పోయిన నాంపల్లి మండలం లక్ష్మణాపురం
గ్రామస్తులు సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిశారు. నిర్వాసితులతో భేటీ అయిన మంత్రి లక్ష్మణాపురం గ్రామస్తుల కోరిక మేరకు పునరావాస చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.
యుద్ధ ప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టాలని కలెక్టర్ కర్ణన్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో నిర్వాసితుల ముందే ఫోన్లో మాట్లాడారు. ప్రాజెక్ట్ ముంపునకు గురైన తమకు రంగారెడ్డి జిల్లా సమీపంలో నివాస స్థలాలు కేటాయిస్తే రుణపడి ఉంటామని నిర్వాసితులు పేర్కొనగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పునరావాసం కల్పించే విధంగా కృషి చేస్తానని భరోసానిచ్చారు.