హైదరాబాద్, జూలై 22 : తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తి, ప్రొఫెసర్ కె.మధుసూదన్ రెడ్డి మృతిచెందారు. నల్లగొండ జిల్లాలోని శివన్నగూడెం ఆయన స్వగ్రామం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మధుసూదన్‌రెడ్డి మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. 1969 తొలి తెలంగాణ ఉద్యమానికి, తర్వాత 1996 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ సాధన ఉద్యమాలకు ఆయన ప్రేరణగా నిలిచినట్లు కొనియాడారు. ఆయన చేసిన అపారమైన కృషి తరతరాలుగా కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో మార్పులను తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు.