హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలుచేయకుండా సీఎం రేవంత్రెడ్డి రోజుకో కొత్త నాటకం తెరపైకి తెస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కులాలు, మతా ల పేరుతో విభేదాలు సృష్టించడం, భాష పేరుతో రెచ్చగొట్టడం, నార్త్, సౌత్ పేరిట విభేదాలు సృష్టించడం కాంగ్రెస్కు కొత్తేమీ కాదని, సీఎం రేవంత్రెడ్డి సోనియా కోసం ప్రాణత్యాగం చేస్తానని చెప్పడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం ఏ గడ్డి అయినా తినేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని దుయ్యబట్టారు. సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న రాజకీయాలు ప్రజల ఆమోదాన్ని పొందలేవని పేర్కొన్నారు.