హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కిరణ్కుమార్ గన్నమనేని విజ యం సాధించారు. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల ఫలితాల ను తాజాగా ప్రకటించారు. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ఈ ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తంగా 55 మంది మహిళలతోపాటు 203 మంది పోటీచేశారు. ఓట్ల లెకింపు ప్రక్రియ ఫిబ్రవరి 10న ప్రారంభంకాగా, తొలి ఫలితం ఈ నెల 11న వెలువడింది. 23 మంది బార్కౌన్సిల్ సభ్యులకుగాను ఇప్పటివరకు 14 మంది ఎన్నికయ్యారు. మరో 9మంది సభ్యుల ఫలితాలు వెలువడాల్సివుంది. శనివారం వెలువడిన ఫలితాల్లో కిరణ్కుమార్ గన్నమనేని విజయం సాధించా రు. ఆయన ఇంతకుముందు నాంపల్లి బార్ అసోసియేషన్లో సెక్రటరీ గా, అధ్యక్షుడిగా సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షుడిగానూ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సందర్భంగా కిరణ్కుమార్ మాట్లాడుతూ అడ్వకేట్ల సమస్యల పరిషారానికి పనిచేస్తానని తెలిపారు. అడ్వకేట్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని, ఇతర బార్కౌన్సిల్ సభ్యులతో కలిసి ‘అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్’ సాధ న దిశగా చర్యలు తీసుకుంటామని స్ప ష్టం చేశారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒకరికీ కృతజ్ఞతలు తెలిపారు.