బ్లడ్‌గ్రూప్ ఏదైనా కిడ్నీ మార్పిడి
బ్లడ్‌గ్రూప్ కలవకపోయినా విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసే అత్యాధునిక వైద్యవిధానం అందుబాటులోకి వచ్చింది.
- ప్రాణాలు నిలుపుతున్న ఏబీవో ఇన్కంపాటబుల్ చికిత్స
- నగరంలో ఇప్పటికే వందలాది మందికి కిడ్నీ మార్పిడి
- స్టార్ హాస్పిటల్ నెఫ్రాలజీ, ట్రాన్స్‌ప్లాంట్ డైరెక్టర్ జీ శ్రీధర్
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): బ్లడ్‌గ్రూప్ కలవకపోయినా విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసే అత్యాధునిక వైద్యవిధానం అందుబాటులోకి వచ్చింది. మన దేశంలో ఏటా 2.20 లక్షల మందికి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరమవుతుండగా కేవలం 7 వేల నుంచి 8 వేల మందికి మాత్రమే కిడ్నీ మార్పిడి సాధ్యమవుతున్నది. దీనికి రెండు ప్రధాన కారణలున్నాయి.
ఒకటి బ్రెయిన్‌డెడ్ వారికంటే కిడ్నీ అవసరమున్న వారి సంఖ్య అత్యధికంగా ఉండటం. రెండోది.. దాతలు న్నా వారి బ్లడ్గ్రూ ప్, రోగి బ్లడ్‌గ్రూప్ తో కలవక చాలా మంది మృత్యువాత పడుతున్నారు. బ్రెయిన్‌డెడ్ వ్యక్తి అవయవాలు కిడ్నీ కోసం నిరీక్షించేలోపు విషమించి చాలామంది మరణిస్తున్నా రు. ఎన్నో పరిశోధనలు జరిపి ఏబీవో ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు స్టార్ హాస్పిటల్ నెఫ్రాలజీ ట్రాన్స్‌ప్లాంట్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీధర్ తెలిపారు. ప్రపంచ ‘కిడ్నీడే’ను పురస్కరించుకొని ఏబీవో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ విధా నం, దాని సక్సెస్‌రేట్‌ను వివరించారు.
బ్లడ్‌గ్రూప్ మ్యాచ్ కానివారికి వరం
మన దగ్గర జీవన్‌దాన్ ద్వారా కెడావర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అందుబాటులో ఉన్నది. చాలామంది రోగులకు వారి కు టుంబ సభ్యుల బ్లడ్‌గ్రూప్ కలవకపోయినా చేసే పద్ధతినే ఏబీవో ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అంటారు.
యాంటిబాడీల తొలగింపు
సాధారణంగా వ్యతిరేక బ్లడ్గ్రూప్లున్నప్పుడు రోగి రక్తంలోని యాంటిబాడీస్ దాత బ్లడ్‌లోని యాంటిబాడీస్‌ను రిజెక్ట్ చేస్తాయి. దీని వల్ల ఆ కిడ్నీలు పనిచేయవు. దీనికి చెక్ పెట్టేందుకు ప్లాస్మా ఫెరసిస్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఏ-బ్లడ్‌గ్రూప్ గల రోగికి బీ-బ్లడ్ గ్రూప్గల దాత కిడ్నీ దానం చేసే సమయంలో రోగి బ్లడ్ గ్రూప్‌లోని రిజెక్ట్ చేసే యాంటిబాడీలను ఈ విధానం ద్వారా 1:8 వరకు తగ్గిస్తున్నారు. రిజెక్టెడ్ యాంటిబాడీస్ మళ్లీ పునరుత్పత్తి కాకుండా రిటిక్స్మ్యాబ్ ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ప్రొసీజర్ పూర్తిచేయడానికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతున్నది.
సక్సెస్ రేట్ 96-97 శాతం
సాధారణ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ మాదిరే ఏబీవో ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో సక్సెస్ రేటు 96 నుంచి 97 శాతం వరకు ఉంటున్నది. స్టార్ హాస్పిటల్లో ఇప్పటి వరకు 42 ఏబీవో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నిర్వహించగా అన్ని సక్సెస్ అయ్యాయి. రోగులు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఈ పద్ధతి మన దేశంలో అందుబాటులోకి వచ్చి దాదాపు 8 ఏండ్లు కావొస్తున్నది. కానీ అవగాహన లేక ఏబీవో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ 1-2 శాతం మాత్రమే జరుగుతున్నాయి. ఈ పద్ధతి వల్ల సకాలంలో కిడ్నీ మార్పిడి చేయగలుగుతున్నారు. ఇంట్లో దాత ఉంటే చాలు, బ్లడ్‌గ్రూప్ కలవకపోయినా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

