Govt Hospital | ఖానాపూర్ టౌన్, ఆగస్టు 9: ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగికి శుక్రవారం వైద్య సిబ్బంది గడువు ముగిసిన సెలైన్ బాటిల్‌ను ఎక్కించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్‌కు చెందిన అజారుద్దీన్ జ్వరంతో ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు సెలైన్ బాటిల్ పెట్టారు. అతనితో వచ్చిన తమ్ముడు స్లైన్ బాటిల్‌పై ఎక్స్పైరీ తేదీ మార్చి 2024 ఉండడం చూసి వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాడు. నర్సు వచ్చి ఆ సెలైన్ బాటిల్ తీసేసి మరో స్లైన్ ఎక్కించింది.
దవాఖానలో గడువు తీరిన మందులు కనిపించడంతో రోగులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సింగ్ అధికారి వాటిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇన్చార్జి సూపరింటెండెంట్ వంశీమాధవ్‌ను వివరణ కోరగా సెలైన్‌లో 2 ఎంఎల్ మాత్రమే రోగిగి ఎక్కిందని వెంటనే తొలగించినట్టు తెలిపారు. బాధ్యులపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు.