హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : ఎక్స్పోజర్ విజిట్ (క్షేత్ర సందర్శన)లో భాగంగా కేజీబీవీ విద్యార్థులు అమెజాన్ సంస్థను సందర్శించారు. 50 మంది విద్యార్థినుల బృందం అమెజాన్ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా అమెజాన్ వలంటీర్లు రోబోటిక్ మోటర్ వాహనాల తయారీపై మార్గనిర్దేశనం చేశారు. రోబోల అమరిక, వాటి ఆపరేట్లో అవగాహన కల్పించారు.
మంచిర్యాల జిల్లాకు చెందిన లాస్యశ్రీ, హనుమకొండకు చెందిన చందన మాట్లాడుతూ.. రోబోల తయారీ రేసులో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విద్యార్థినులను అభినందించారు.