Patnam Narendar Reddy | లగచర్ల ఘటన కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే, పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్యనేతల ఆదేశాలతోనే చేసినట్లు రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు. సురేశ్‌కు తరచూ ఫోన్ చేసినట్లు నరేందర్‌రెడ్డి ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. నరేందర్‌రెడ్డి నేరం ఒప్పుకున్నట్లుగా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు.. నిందితులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారని చెప్పారు. లగచర్ల ఘటనలో ఏ1గా పట్నం నరేందర్‌రెడ్డిగా పేర్కొన్నట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు.
ఆధారాలు ఉన్నాయి కబట్టే నరేందర్‌రెడ్డి అరెస్టు చేశామని.. రాళ్లు, కర్రలు, కారంపొడి తీసుకొచ్చినట్లు ఆధారాలున్నాయన్నారు. లగచర్ల ఘటనలో 47 మందిని అదుపులోకి తీసుకున్నామని.. 47 మందిలో 17 మందిని రిమాండ్‌కు తరలించామన్నారు. ఇవాళ మరో ఐదుగురిని విచారించి డిమాండ్ చేశామని, మిగతా వారి కోసం నాలుగు బృందాలు వెతుకుతున్నాయన్నారు. అధికారులను తప్పుదోవ పట్టించిన సురేశ్‌పై గతంలో పోలీస్ కేసులున్నాయని.. కొందరికి భూమి ఉన్నా భూసేకరణ పరిధిలోకి రాదన్నారు. లగచర్ల ఘటనలో మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని.. నిందితులు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. చాలామంది రైతులను విచారించి వదిలిపెట్టామని.. దర్యాప్తు త్వరగా పూర్తి చేసి చార్జిషీట్ ఫైల్ చేస్తామన్నారు.