హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సచివాలయంలో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది. వరదలు, ప్రభుత్వ చర్యలపై క్యాబినెట్ సమీక్షించనున్నది. అకాల వర్షాల వల్ల సాగుకు తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై చర్చించనున్నది. ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల రోడ్లు, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధరించడం కోసం చేపట్టనున్న చర్యలపై చర్చించనున్నది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై కూడా చర్చించనున్నది.