కొడంగల్, నవంబరు 19: లగచర్ల సంఘటనలో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న బోగమోని సురేశ్ మంగళవారం కొడంగల్ కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట లొంగిపోయాడు. వారం రోజులుగా సురేశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలుగా పలు రాష్ర్టాల్లో సోదాలు నిర్వహించారు. మంగళవారం సురేశ్ స్వయంగా కొడంగల్ కోర్టుకు హాజరై లొంగిపోయాడు. సురేశ్‌కు స్థానిక ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించి, 14 రోజల పాటు సంగారెడ్డి జైలుకు రిమాండ్‌కు తరలించారు. ‘ప్రశ్నించే గొంతుకు సంకెళ్లు వేస్తే.. మూగబోవు’, ‘రాకెట్ వేగంతో పోరాటం చేస్తా..’అని నినాదాలు చేస్తూ పోలీసు వాహనంలో జైలుకు వెళ్లాడు. ఏ-38 హన్మంతు, ఏ-55 నీరటి సురేశ్‌లను బొంరాస్‌పేట పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచగా 14 రోజుల రిమాండ్ విధించింది.