కేసీఆర్ జాతీయ పార్టీ.. జల వివాదాలకు ఇదే పరిష్కారం !
KCR on water disputes:దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు దాటింది. కానీ ఇంకా దేశ ప్రజల్ని నీటి సమన్య వెంటాడుతూనే ఉన్నది. తాగునీరు, సాగు నీరు అందని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఇన్నాళ్లు పాలించినా.. మన నీటి కష్టాలు మాత్రమే తీరకుండానే ఉండిపోయాయి. నీరే జీవిధారం అన్న భావన అందరికీ తె
హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు దాటింది. కానీ ఇంకా దేశ ప్రజల్ని నీటి సమన్య వెంటాడుతూనే ఉన్నది. తాగునీరు, సాగు నీరు అందని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఇన్నాళ్లు పాలించినా.. మన నీటి కష్టాలు మాత్రమే తీరకుండానే ఉండిపోయాయి. నీరే జీవిధారం అన్న భావన అందరికీ తెలిసిందే. నీటి కోసమే ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా ఇంకా పలు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. ఈ జల వివాదాలకు పరిష్కారం కావాలి. ప్రతి ఇంటికి, ప్రతి పొలానికి నీరు పుష్కలంగా అందాలి. సుజల దేశంగా భారత్ ఎదగాలంటే.. కొత్త ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రానికి ఎంత నీరు అవసరం, ఏ ప్రాంతానికి ఎంత నీరివ్వాలి.. ఎక్కడ నీరెక్కువ ఉంది. ఎక్కడి నీటి కొరత ఉంది. అలాంటి ప్రాంతాలకు నీటిని అందించడమే సీఎం కేసీఆర్ ఉద్దేశం.
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రైతుల, ప్రజల నీటి అవస్థలను తీర్చారు కేసీఆర్. ఇదో అసాధారణ ప్రాజెక్టు. తెలంగాణ అన్నదాతలను కాళేశ్వరం ఆదుకున్నది. ఇదే రీతిలో భారత్‌ను కూడా అన్నపూర్ణగా మార్చాల్సిన తరుణం ఆసన్నమైంది. నీటి లభ్యత, నీటి వినియోగం, నీటి సామర్థ్యంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టమైన అవగాహన లేదు. ఏ రాష్ట్రానికి ఎంత నీరు అవసరమో.. ఎంత సామర్థ్యం ఉందో ఆ పార్టీలు చెప్పలేకపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నీటి కోసం జనం ఇంకా మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రకటించబోయే కొత్త పార్టీ ఆ జల సమస్యలపై ఫోకస్ పెట్టింది. గంగా నది నుంచి కావేరీ నది వరకు ఉన్న అనేక జల వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఆ నీటి సమస్యలను తీర్చి దేశ ప్రజలకు నిర్విరామంగా నీరును అందించాలనుకుంటున్నారు. నూతన జాతీయ విధానంతో లక్షలాది ఎకరాలకు నీటిని పారించడమే విజన్‌గా కేసీఆర్ ముందుకువెళ్తున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు అవసరం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

