హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ కీర్తి అజరామరమని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మె ల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ నగరంలో ఆదివా రం తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్స వ వేడుకల్లో ఎమ్మెల్సీ దేశపతి, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయటంలో కేసీఆర్ నిర్వహించిన పాత్ర అద్వితీయమైనదని, ఏ ప్రలోభాలకు లొంగకుండా, అవమానాలకు అవరోధాలకు కుంగకుండా ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
దశాబ్దాల తరబడి వేధించిన ఎన్నో సమస్యలను పదేండ్ల పరిపాలనలో పరిషారం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్‌ను భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటాయని దేశపతి స్పష్టంచేశారు. తెలంగాణ బిడ్డలు ఖండాంతరాల్లో ఉన్నప్పటికీ, వారి గుండె చప్పుడు మాత్రం ఎప్పుడూ జై తెలంగాణనే.. అని పేర్కొన్నారు.
60 ఏండ్ల సమైక్య పాలనలో అరిగోస పడ్డ తెలంగాణలో రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాతనే ప్రశాంతత వచ్చిందని, తరతరాలుగా రక్తం పారిన తెలంగాణ నేలమీద నీళ్లు పారాయని ఎమ్మెల్సీ దేశపతి పేర్కొన్నారు. నీళ్లు లేక నెర్రెలుబాసిన భూముల్లో పచ్చని పంటలు పండాయని చెప్పారు. తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్యాణ్‌రావు కాసుగంటి, నాయకుడు రామ్మోహన్ దంతాల మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ అవతరణ ఉత్సవాల్లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ మదన్మోహన్ శెట్టి, అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్తోపాటు, వెల్లింగ్టన్, టౌరంగా, క్వీన్స్ టౌన్, క్రైస్ట్ చర్చ్, రోటరోవా తదితర నగరాల్లో తెలంగాణ ప్రవాసులతో జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.