KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. కేసీఆర్‌ను 50 నిమిషాల పాటు విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కమిషన్‌కు కేసీఆర్ నివేదిక ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కూడా కమిషన్‌కు కేసీఆర్ అందజేశారు. కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సహా నివేదిక సమర్పించారు కేసీఆర్.
విచారణ అనంతరం బయటకు వచ్చిన కేసీఆర్ నేరుగా తన కారులో ఎక్కి కూర్చున్నారు. అనంతరం అక్కడున్న పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేశారు. కేసీఆర్ కారులోనే హరీశ్‌రావు కూడా వెళ్లారు. ఇక కేసీఆర్ బయటకు రాగానే జై కేసీఆర్.. జై తెలంగాణ అని పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.
ఇక ఉదయం 9.30 గంటల సమయంలో ఎర్రవల్లి నుంచి కేసీఆర్ హైదరాబాద్‌కు బయల్దేరారు. సరిగ్గా ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహముద్ అలీ బీఆర్కే భవన్‌లోకి వెళ్లారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన కేసీఆర్ విచారణ
50 నిమిషాల పాటు కొనసాగిన విచారణ https://t.co/TSb4jbkoLb pic.twitter.com/jBQcEz4u4y
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025