హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోతుందా? అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో ప్ర శ్నించారు. రేవంత్‌రెడ్డి సీఎంలా కాకుండా ఇం కా పీసీసీ అధ్యక్షుడిలాగే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక యూట్యూబ్ చానళ్లలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. సీఎం హోదాలో కేసీఆర్ పాల్గొ న్న కార్యక్రమాల వీడియోలను తెలంగాణ సీ ఎంవో, రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ యూట్యూబ్ చానళ్లలో వాటిని అప్లోడ్ చేసి ప్రత్యక్ష ప్రచారం చేసేవారని తెలిపారు.
రేవంత్‌రెడ్డి సీఎం కాగానే పాత వీడియోలన్నింటినీ యూట్యూబ్ నుంచి తొలగించి నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను తప్ప మరెవరూ కనిపించొద్దనే దురుద్దేశంతో కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వ జమెత్తారు. తెలంగాణ సాధించి, పదేండ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో ఉంచి దేశానికే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ వీడియోలు, ప్రసంగా లు ప్రజలకు అందుబాటులో ఉండొద్దనే కుట్రతోనే వాటిని తొలగించారని దుయ్యబట్టారు. దుర్బుద్ధితో వాటిని తొలగించినంత మాత్రాన కేసీఆర్ పేరును ప్రజల్లో లేకుండా చేయాలనుకోవడం అవివేకమే అవుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదనే సత్యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.