హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే మార్గమధ్యంలోనే మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం తన వ్యవసాయ క్షేత్రం నుంచి సీఎం కేసీఆర్ దేవరకద్రకు హెలికాప్టర్లో బయలుదేరారు. కాసేపటికే గాలిలో ఉండగానే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే గుర్తించిన పైలట్ మార్గమధ్యం నుంచి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్‌ను మళ్లించి సురక్షితంగా దించేశారు. సీఎం కేసీఆర్‌కు మరో ప్రత్యామ్నాయ హెలికాప్టర్‌ను ఏవియేషన్ సంస్థ ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి తర్వాత హెలికాప్టర్ రాగానే.. యథావిధిగా దేవరకద్ర పర్యటనకు సీఎం కేసీఆర్ బయలుదేరి వెళ్లారు.