జగద్గిరిగుట్ట ఫిబ్రవరి 17: కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఓ చిన్నారి వితరణతో తన గొప్ప మనసును చాటుకున్నది. రంగారెడ్డి నగర్‌కు చెందిన ఆలేటి సురేశ్‌గౌడ్, సౌమ్య కుమార్తె హైత్విగౌడ్ చిన్ననాటి నుంచే కేసీఆర్‌పై అభిమానం పెంచుకున్నది. స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న హైత్విగౌడ్ తాను కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.5 వేలతో అదే స్కూల్‌కు మోటర్‌ను కొనిచ్చింది. దీంతో బాలికను పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నేతలు అభినందించారు.