హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకొనే బక్రీద్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. దైవాజ్ఞను అనుసరించి సమాజ హితంకోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని పేర్కొన్నారు. తమకు కలిగిన దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ ద్వారా నేర్చుకోవచ్చని సూచించారు.